పేదవాళ్లు గొప్పగా బతకాలని ఇండ్లు నిర్మించాం- తలసాని

29
talasani
- Advertisement -

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్ భవన సముదాయంను ఈ రోజు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కొల్లూరులో 142 ఎకరాల స్థలంలో పేదల కోసం నిర్మిస్తున్న భవన సముదాయం ఓ కళ ఖండం.18 నెలల్లోనే కొల్లూరులో సకల వసతులతో 15 వేల పైగా ఇండ్లు కట్టామన్నారు.

ఇక్కడ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో స్థానికులకు 10 శాతం, హైదరాబాద్ వారికి 90 శాతం మందికి కేటాయిస్తాము. 70 వేల కోట్లతో హైదరాబాద్ మహానగరంలో సమగ్ర అభివృద్ధి చేశామని మంత్రి తలసాని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుడా హైద్రాబాద్ నిరుపేదల కోసం 15 శివారు ప్రాంతాల్లో 33,550 ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రభుత్వం బాధ్యతగా నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్ నిర్మాణలు చూపెడుతామని చెప్పిన కాంగ్రెస్‌ వినలేదు.పేదవాళ్ళు గొప్పగా బతకాలని పూర్తిగా ఉచితంగా ఇండ్ల నిర్మాణం చేశాము.పేద వాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఆలోచన చేయలేదని మంత్రి తలసాని తెలిపారు.

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ని కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసింది. జిహెచ్ఎంసి పరిధిలో స్థలాలు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీయే. సీఎం కేసీఆర్ పేదల గౌరవం గా ఉండాలని డబుల్ బెడ్ ఇండ్లు నిర్మాణాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి చూసి ప్రజలు విసుకుంటున్నారు.పేదల కోసం కట్టిన ఇండ్లు చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క చేసిన ఛాలెంజ్‌ను ధైర్యంగా స్వీకరించాము. భట్టి విక్రమార్క మాటలను ప్రజలు ఎవరు నమ్మారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ను భట్టి చూడకుండా తప్పించుకొని పోయాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతున్నరు. కొల్లూరులో సకల సౌకర్యాలతో పేద ప్రజలకు ఇండ్లు కట్టించాము. రాజకీయల నాయకుల ప్రమేయం లేకుండా, పూర్తిగా అధికారుల ద్వార పారదర్శకంగా నిజమైన పేదలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మేయర్‌ తెలిపారు.

- Advertisement -