దుబ్బాకలో లక్షా మెజారిటీతో గెలుస్తాం: మంత్రి హరీశ్‌ రావు

310
minister harish
- Advertisement -

ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ దుబ్బాకలో లక్ష మెజార్టీతో గెలుస్తుందన్నారు మంత్రి హరీశ్‌ రావు. కేసీఆర్ కు దండం పెట్టి దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ విద్యార్ధి,యువత అనుబంధ సంఘాల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన హరీశ్…ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. దుబ్బాక నియోజకవర్గంలో అతి త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని తెలిపారు.

దుబ్బాక నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలను కలువాలన్నారు. మనం చేసిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు. బీజేపీకి కార్యకర్తలు లేరని విమర్శించారు.టీఆర్ఎస్ కు ఓటు వేసేందుకు దుబ్బాక ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బోరు బావులకు విద్యుత్ మీటర్ల బిగించేందుకు సిద్ధమవుతోందని దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కువ సాగునీరు దుబ్బాక నియోజకవర్గానికే వస్తుందన్నారు. లక్షా 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని, పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వుకుంటే రెండు పంటలు వేసుకోవచ్చని వివరించారు.దేశంలోని 18 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించారన్నారు.

- Advertisement -