దౌల్తాబాద్‌లో హరీశ్‌ రావుకు బ్రహ్మరథం..

177
dubbaka

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో మంత్రి హరీశ్ రావుకు బ్రహ్మరథం పట్టారు గ్రామస్తులు. బతుకమ్మ,బోనాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి మరియు 5 లక్షలతో నిర్మిస్తున్న బీడీ కార్మికుల ఖార్కనా భవనానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ …రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. తనకు ఆప్యాయంగా స్వాగతం పలికి టీఆర్ఎస్‌కే ఓటేస్తామని అనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వమని తెలిపిన హరీశ్…బీజేపీ ప్రభుత్వం రైతుల బాయిల దగ్గర మీటరు పెడతామని చెబుతోందని వారికి ఓటుతో గట్టి సమాధానం ఇవ్వాలన్నారు. గువ్వలేగి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.