ఫోటో ట్రెడ్ ఎక్స్ పో విజయవంతం కావాలి: శ్రీనివాస్ గౌడ్

77
srinivas goud
- Advertisement -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో LB నగర్ లోని KBR కన్వెన్షన్ లో అక్టోబర్ 1, 2, 3 వ తేదీలలో ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ఫోటో గ్రాఫర్స్ కు ఫోటో టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించాలనే ఉదేశ్యం తో నిర్వహిస్తున్న ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫోటోగ్రఫీకి ఎంతో డిమాండ్ ఉందన్నారు. ఫోటోగ్రఫీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి ఫోటోగ్రాఫర్స్ అవగాహన కల్పించాలని కోవడం ఫోటోగ్రాఫర్స్ ఎంతో మేలు జరుగుతుందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరెడ్డి, అధ్యక్షుడు హుస్సేన్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి శైలేందేర్, నాగరాజు, జగదీశ్ గౌడ్, S. రవీందర్, గుర్రం జంగారెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -