మద్యం అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు..

335
Srinivas Goud
- Advertisement -

మార్చి నెల 22 వ తేదీ నుండి సీఎం కేసీఆర్.. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆర్ధిక పరిస్థితులు ముఖ్యం కాదు అని లాక్ డౌన్‌లో భాగంగా వైన్స్ షాప్ లు బందు చేశారు. కరోన కట్టడికి సీఎం కేసీఆర్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి దేశంలోనే మన రాష్ట్రంలో కరోన కట్టడి చేశారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు రవీంద్రభారతీలోని తన చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో వైన్ షాపులు క్లోజ్ అయ్యాయి. కానీ దేశవ్యాప్తంగా సడలింపులో భాగంగా అన్ని రాష్ట్రాలలో షాపు లు ఓపెన్ కావడమే అంతేకాకుండా మనం గుడుంబాని ఎంతో కష్టపడి నిర్ములన చేశాం. కానీ ఇతర రాష్ట్రాల నుండి లారీలో బెల్లం సప్లై అవుతుంది. అంతేకాదు నాటు సారా తోపాటు కల్తీ మద్యం కూడా ఇతర ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వస్తుంది. వాటి అన్నింటిని తట్టుకోవడం కోసం మనం కూడా వైన్ షాపులను ఓపెన్ చేయాలని చెప్పము. సీఎం కేసీఆర్ కూడా క్యాబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చాలా షాపులు నేను విసిట్ చేశాను అన్ని షాపు లలో భౌతిక దూరం పాటిస్తున్నారు.షాపుల దగ్గర శానిటేషన్ చేస్తున్నారు.షాపుల దగ్గర ఎమ్మార్పీ రేటులు డిస్ల్పే చేయాలని చెప్పము. అంతేకాదు కరోన కట్టడికి సంబంధించి సూచనలు సలహాలు సూచించే బోర్డ్ కూడా పెట్టాలని చెప్పామన్నారు మంత్రి. అయితే లాక్ డౌన్ సమయంలోనే మందును అమ్మారు అని వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడ కూడా అక్రమంగా మద్యం అమ్మలేదు.మేము ఇప్పటివరకు కూడా గోడౌన్‌ల నుండి మద్యం సరఫరా చేయలేదు. అయితే నకిలీ మద్యం సరఫరా చేశారు.మాస్క్ లు లేకుండా మద్యం విక్రయాలు జరుపవద్దు అని చెప్పాము.

ఎండలు ఎక్కువ గా ఉన్నాయి కాబట్టి కొనేవాళ్ళు గొడుగు తీసుకొని వస్తే బాగుంటుంది. దానితోపాటు భౌతిక దూరం ఉంటుంది. వైన్ షాపు యజమానులు అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు, అవసరం అయితే లైసెన్స్ రద్దు చేస్తాం. పర్మిట్ రూమ్ లు ఎక్కడ అనుమతి లేదు,పర్మిట్ రూమ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు. కంటైన్మెంట్‌లో 6 షాపు లు ఓపెన్ చేయడం లేదు,ఇతర కారణాలతో కొన్ని షాపు లు ఓపెన్ చేయడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు.

ఎక్కడైనా కల్తీ మద్యం సరఫరా చేస్తే పిడి యాక్ట్ అమలు చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 2000 పైగా కేసులు బుక్ చేశాం.షాపు యజమానులకు కూడా కొన్ని సూచనలు చేశాం.షాపులో సెక్యూరిటీ సిబ్బంది పెట్టాలని, భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చెయ్యాలి.మా అధికారులు 24 గంటలు పని చేసి అక్రమ మద్యం, కల్తీ మద్యం సరఫరాపై నిఘా పెడుతున్నారు.మిగత రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో చాలా డిసిప్లేన్ అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం తేదీ ముగిస్తే వాటిని అమ్మకం జరుపరు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు వాళ్ళు మద్యం ఇంటికే పంపుతున్నారని మంత్రి తెలిపారు.

- Advertisement -