రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్..

70
Minister Srinivas Goud
- Advertisement -

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణం నుండి అడ్డాకులలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. ఆ దారిలో జానంపేట వద్ద కర్నూల్ నుండి వస్తున్న ఒ వాహనం ప్రమాదవశాత్తు డివైడర్ డీ కొని బోల్తాపడింది.

ఈ సంఘటనను చూసి మంత్రి వెంటనే వాహనంలో ఉన్న వారిని తన సిబ్బందితో కలసి రక్షించారు. వాహనంలో ఉన్న చిన్న పిల్లలను బయటికి తీసి ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం క్షతగాత్రులను జానమ్ పేట PHC కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్‌ను ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -