ఈజిప్టులోని కైరో లో జరిగిన CMAS Finswimming లో మొట్టమొదటి సారిగా దేశానికి 2 రజత పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన విక్టోరియా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాకారులకు, కోచ్ లకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలను గణనీయంగా అందిస్తున్నామన్నారు. క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసే కోచ్ ల సర్వీస్ ను ప్రభుత్వం రెగ్యులర్ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య అభ్యాసం కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17వేల గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారుల ప్రతిభ ను వెలికి తీయడానికి CM Cup క్రీడలను నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయి వేదికలపై పతకాలు సాధించే క్రీడాకారులను దేశానికి సరిపడేంత అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించామన్నారు.
Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో
అంతర్జాతీయ స్థాయి వేదికలపై స్విమ్మింగ్ లో రాణిస్తున్న క్వీనీ విక్టోరియా ను ఈ సందర్భంగా అభినందించారు. అలాగే, స్విమ్మింగ్ క్రీడలో వారి పిల్లలు స్టీఫెన్ కుమార్, ఎలిజబెత్ క్వీన్ లు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి స్విమ్మింగ్ లో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్న సందర్బంగా వారి కుటుంబ సభ్యులను అభినందించారు. భవిష్యత్ లో జరిగే పలు అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Also Read:Kanguva:క్రేజీ అప్‌డేట్