పర్యాటకుల భూతల స్వర్గం తెలంగాణ…

143
srinivas goud
- Advertisement -

ప్రపంచ పర్యాటకుల భూతల స్వర్గంగా తెలంగాణ రాష్ట్రం ను తీర్చిదిద్దుతున్నామన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్. లండన్ లో వరల్డ్ ట్రావెల్ మార్ట్ (డబ్ల్యూటీఎం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ABTA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియా టూరిజం సెక్రటరీ అరవింద్ సింగ్ తో కలసి పాల్గొని పలు దేశాల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ గారు టూరిజం అభివృద్ధి కి చేస్తున్న కృషిని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ కారణంగా పర్యాటక రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు, పోచంపల్లి ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికయ్యేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో కృషి చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. కొవిడ్ తర్వాత ప్రపంచ పర్యాటక రంగం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ లండన్ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని వివిద దేశాల పర్యాటకులు సందర్శించాలని కోరారు. వివిధ దేశాల పర్యాటకుల నుండి ఎంతో మంది పర్యాటకులు ఆసక్తిని చూపిస్తున్నారన్నారు. తెలంగాణ పర్యాటకులకు భూతల స్వర్గంగా ఉండబోతోందని మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశంలో తెలిపారు.

లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలపై సమగ్ర సమాచారాన్ని, పర్యాటక సామగ్రి ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్ట్ బుద్ధవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ, వేయి స్తంభాల గుడి, సమ్మక్క సారాలమ్మ, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్ట్, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శిస్తున్నామని అన్నారు. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, బతుకమ్మ, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్ట్ (WTM)లో ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో భారత దేశానికే తలమాణికమైన కోహినూర్ వజ్రం గురించి సైతం చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ (ABTA) ప్రతినిధులను తెలంగాణను సందర్శించి రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ మనోహర్, పర్యాట శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేష్, అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ ట్రావెల్ ఏజెంట్స్ డైరెక్టర్ సుషాన్ ధీర్, ఆబ్టా హెడ్ ఆంజెలా హిల్స్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -