నీటి వినియోగం, ఆవాల పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి

431
Minister Singireddy Niranjan Reddy
- Advertisement -

తెలంగాణలో సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, అవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కు ప్రతిపాదనలు పంపారు మంత్రి సింగిరెడ్డి. ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయానికి సమృద్దిగా సాగునీరు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో మొత్తం 25మేజర్, 12మీడియం ప్రాజెక్టులున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులు, కుంటలను పునరుద్దరించడంతో కోటి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ వైపు సాగుతున్నామన్నారు.

అందుబాటులోకి వచ్చిన సాగునీరును సమర్దంగా వాడుకునేందుకు నీటి వినియోగ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తర తెలంగాణలో ప్రముఖంగా పండించే ఆవాల పంట ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు అనువైన ప్రాంతం అయిన జగిత్యాలలో పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసి నూతన వంగడాలు, అనువైన సాగు పద్దతులు కనుగొనడానికి రైతులకు మేలు జరిగేలా సహకరించాలన్నారు. ఈ పరిస్థితులను గుర్తించి సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని విజ్నప్తి చేశారు.

- Advertisement -