సీఎం కేసీఆర్ ఆదేశాలతో పదోన్నతులపై ముందడుగు..

184
Minister Satyavathi
- Advertisement -

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన గురుకుల విద్యాలయాల సిబ్బంది, అధికారులతో గురువారం హైదరాబాద్, మసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ స‌మావేశంలో ఉద్యోగుల పదోన్నతి, సదుపాయాల కల్పనపై ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హత కలిగిన అందరికీ పదోన్నతి ల‌భిస్తుంద‌ని తెలిపారు. సర్వీస్ రూల్స్ ఇబ్బంది వల్ల సరైన న్యాయం జరగడం లేదన్న వాటిని పరిశీలించి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గురుకులాలకు విద్యార్థులు వచ్చారు. వీటిపట్ల తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం చాలా గొప్పదన్నారు. గురుకులాలకు వచ్చే పిల్లల భవిష్యత్‌ను గొప్ప‌గా తీర్చిదిద్దాల‌న్నారు. ఇందుకోసం పని చేస్తున్న‌ మీ సమస్యలు పరిష్కరించడం కూడా త‌మ‌ బాధ్యత అన్నారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరవేసి వారికి మేలు చేయడంలో అంకిత భావంతో పని చేయాల‌న్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పదోన్నతులు, భర్తీపై రాష్ట్రంలో ముందడుగు పడింద‌న్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌.

- Advertisement -