టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నాయకులు..

108
trs
- Advertisement -

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి భారీగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 8వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుమారు 100 మంది నాయకులు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యవసాయ రైతు కూలీ విభాగం జిల్లా వైస్‌ చైర్మన్‌ కర్నాటి శ్రీనివాస్‌, నగరా అజ్య, గుంజ శ్రీను, షేక్‌ నయీమ్‌, గోపి, జోసెఫ్‌, మధు, దిలీప్‌ ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ నెమ్మాది భిక్షం, ఉప్పల ఆనంద్‌, కౌన్సిలర్లు జహీర్‌, చింతలపాటి భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారని అన్నారు. ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులతో పాటు ఇంతవరకూ ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధంలేని వారు సైతం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, అందుకు కారణం రాజకీయాలకతీంగా జరుగుతున్న అభివృద్ధేనని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -