హుజుర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో నేడు సూర్యాపేట జిల్లా నెరేడుచర్ల మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి,మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత,ఎంపీ బండ ప్రకాష్,ఎమ్మెల్యే నరేందర్,హుజుర్‌నగర్ అభ్యర్థి సైదిరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతరం హుజూర్‌నగర్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, దేవరకొండ శాసనసభ్యులు రవీందర్ నాయక్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 21న జరుగుతున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు కోసం గిరిజనులతో మాట్లాడి కారు గుర్తుపై ఓట్లు వేయమని చెప్పడానికి వచ్చామని మంత్రి తెలిపారు. రోజు రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై ఆశీర్వదిస్తూ వస్తున్నారని అన్నారు. ఈరోజు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసు అన్నారు.గతంలో ఉత్తం ముఖ్యమంత్రి అవుతానని, మరొక్కసారి కేంద్ర మంత్రి అవుతా అని అంటే నియోజకవర్గ ప్రజలు మరొక్కసారి గెలిపించారని అన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి వి ఉత్త మాటలు అన్నారు.
అనేక ఏండ్లుగా ఫ్లోరోసిస్ బాధతో నలిగి పోతున్న నల్గొండ జిల్లా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం కెసిఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరు.గిరిజనులు వలస పోతుంటే పట్టించు కొని ఈ నాయకులు హుజూర్ నగర్ నియజకవర్గంలో ఏం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తం కుటుంబానికి మాత్రమే లాభం అని టిఆర్‌ఎస్ గెలిస్తే మొత్తం నియోజక వర్గానికి లాభం ఉంటుంది అన్నారు.కెసిఆర్ ప్రవేశ పెడుతున్న అభివృద్ది పథకాలే టిఆర్ఎస్‌ను గెలిపిస్థాయి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి ఎంతో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. తండాలను పంచాయతీలుగా తీర్చి దిద్దిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం. మొత్తం అన్ని పథకాలు అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని పార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.మారు మూల తండాలో పుట్టిన నాకు ఎమ్మెల్సీ గా నన్ను గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించింది కెసిఆర్ అని మంత్రి సత్యవతి తెలియచేశారు. వేరే పార్టీలో లాభీంగ్ వ్యవస్థ వుంటుందని.. ఈ ప్రాంత గిరిజన సోదర సోదరీ మణులు కారు గుర్తుపై ఓట్లు వేసి ఈ ప్రాంత ఎమ్మెల్యే గా శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సైదిరెడ్డి అన్న 40000వేల పై చిలుకు ఓట్లతో గెలుస్తారు. బ్రమండమైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన కెసిఆర్ ఆద్వర్యంలో ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓట్లు వేయాలని ఎంపీ కవిత కోరారు. ఈ ప్రాంతంలో 30000 వేల పై చిలుకు ఓట్లు కలిగిన లంబాడా సోదర సోదరీమణులు తప్పకుండా టిఆర్‌ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని తెలిపారు.
ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ఓటర్లు చైతన్య వంతమైన ఓటర్లు వున్నారని ఈ ప్రాంత ఓటర్లు ఖచ్చితంగా అభివృద్ది చేసే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యే అభ్యర్థికే ఓట్లు వేయాలని రవీంద్ర కుమార్ కోరారు. ఒక లక్ష ఇరవై వేల రూపాయలు గిరిజన విద్యార్థుల చదువు కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి వున్న ఈ ప్రాంత రైతు సోదరులు,పెన్షన్లు పొందుతున్న అన్ని వర్గాల ప్రజలు,చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి సైది రెడ్డిని 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.