మంత్రి కొప్పుల ప్రారంభిచిన తెప్పల పోటీలు..

549
koppula eshwar

తెలంగాణలో తొలిసారిగా రాష్ట్ర స్థాయి తెప్పల పోటీలు ఈ రోజు ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నదిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ‘మత్స్యవీర’ పేరుతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ తెప్పల పోటీలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారభించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అర్గనైజర్ మూల విజయారెడ్డి, కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు హాజరైయ్యారు.

పోటీలను ప్రాంభిచిన అనంతరం బోటులో గోదావరి నదిలో మంత్రి కొప్పుల , ఎమ్మెల్యే చందర్ , ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు షికారు చేశారు. ఈ పోటీ సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. ఇందులో పాల్గొనే మత్స్యకారులకు ఆకర్షనీయమైన బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 200 మంది పాల్గొన్నారు. తెప్పల పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.