గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సబితారెడ్డి..

182
Minister Sabithareddy
- Advertisement -

శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రులకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా రఘునాథపాలెంలో మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం రఘునాథ పలెంలో మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించి..ఆన్‌లైన్ తరగతులను పరిశీలించారు. అదేవిధంగా ఖమ్మంలో నూతనంగా నిర్మించి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ హబ్‌ను సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ కలిసి సందర్శించారు.

ఈ సంర్భంగా మంత్రి సబిత మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరితగతిన లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణ కార్యకలాపాలకు చర్యలు చేపట్టిందని వివరించారు. స్థానికంగా ఉండే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ప్రాంతాల్లోనే ఐటీ ఉద్యోగాలు పొందడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. అనంతరం లకారం ట్యాంక్ బండ్‌ను సందర్శించారు. ఖమ్మం జిల్లాకు ఐటీ రంగాన్ని తీసుకురావడం పట్ల మంత్రి పువ్వాడకు అభినందనలు తెలిపారు.

- Advertisement -