బర్త్ డే…మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

168
ajay
- Advertisement -

తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖమ్మం లోని తన నివాసంలో మొక్కలు నాటారు పువ్వాడ అజయ్ కుమార్.

ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ వాతావరణంలో రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుంది అని దాని వలన అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారని అందుకు సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.

నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మొక్కలు నాటాలని కోరిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -