నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కవితమ్మను భారీ మెజార్టీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్ఎస్‌కు 728 ఓట్లు వస్తే రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్లు రాలేదన్నారు. అంతేగాదు ఈ రెండు పార్టీల నుండి 192 ఓట్లు టీఆర్ఎస్‌కు వచ్చాయని ఆ పార్టీల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంపై ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమని తెలిపారు.
ఎంపీ ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి డూప్లికేట్ బాంబు పేపర్లు రాసిచ్చి అరవింద్ ప్రజలను మోసం చేశారని వారి రి అబద్దాలకు జవాబుగా కవితకు భారీ మెజార్టీ ఇచ్చారని తెలిపారు. టీఆర్ఎస్‌కు ఓటేసిన ఎంపీటీసీలు,జడ్పీటీసీలు, సర్పంచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత …నిజామాబాద్ కలెక్టర్ , ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన కవితకి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గణేష్ బిగాల.