నిజామాబాద్‌ ఫలితమే దుబ్బాకలో రిపీట్‌: హరీశ్‌ రావు

156
harishrao

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌దే గెలుపన్నారు మంత్రి హరీశ్ రావు. ఉమ్మ‌డి నిజామ‌బాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీశ్… దుబ్బాక ఉపఎన్నిక‌లో కూడా ఇవే ఫ‌లితాలు రిపీట్ అవుతాయని స్పష్టం చేశారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ డిపాజిట్లు గల్లంతు అయ్యానని దుబ్బాకలో కూడా ఈ రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు కావడం వెల్లడించారు. ఎమ్మెల్సీ ఫ‌లితాల‌తో కాంగ్రెస్, బీజేపీల గోబెల్స్‌ ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబ‌ద్ధాల‌ని రుజువ‌య్యాయ‌ని చెప్పారు.

మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి జీహెచ్ఎంసీ.. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీదేనని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మెద‌క్ జిల్లా చేగుంట వైస్ ఎంపీపీ, బీజేపీ నేత రామ‌చంద్రం మంత్రి స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు.