కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ప్రగతి, హరితహారం, కోవిడ్ 19, వ్యవసాయ వేదికలు, వివిధ అంశాలపైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లాపరిషత్ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శ్వేత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం కటినంగా వ్యవహరిస్తుందని.. నకిలీ విత్తనాల ఆచూకీ తెలిపిన వారికి ఐదువేల రూపాయల పారితోషికం ఇవ్వడం జరుగుతుందని ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా 7 కొవిడ్ కేసుకు ఆక్టివ్ లో ఉన్నాయి. ప్రతి వ్యక్తి భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్ర పరుచుకోవాలి, మా స్క్ లు ధరించాలన్నారు.మన దేశంలో మరో సారి లాక్ డౌన్ విధించడం జరగదని ప్రధాన మంత్రి తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ స్వంతంగా జాగ్రత్త వహించాలి. కరోనా మహమ్మారి చావలేదు కాబట్టి మనమందరం ఎవరికీ వారు రక్షించుకోవాలి అని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. చెట్లు నాటడం తోపాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. హరితహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. రైతు వేదికలు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలి అని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.