ఎంపీ అర్వింద్ వైఖరిపై మంత్రి వేముల ఆగ్రహం..

169
Prashanth Reddy
- Advertisement -

నిజమాబాద్ ఎంపీ అర్వింద్ వైఖరిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మంత్రి ఎంపీ ఆర్వింద్‌ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడారు. మాధవనగర్ ఆర్వోబికి నిధులు ఇవ్వకుంటే ఉద్యమం చేస్తా అంటున్నావు అర్వింద్.. మరి పసుపుబోర్డు మీద ఉద్యమం ఎందుకు చేయవు అని మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణకు అసలు పసుపుబోర్డు ఇవ్వమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసినవ్. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు డ్రామాలు ఆడుతున్నావ్ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం ఉంటుంది. తెలంగాణకు మాత్రం ఇవ్వకుండా మోసం చేశారు.

ముఖ్యమంత్రి,కేటీఆర్, కవిత,ప్రశాంత్ రెడ్డిని తిట్టి పబ్బం గడుపుకోవడమే నీ పని.. ప్రజలకు ఏమి చేయాలో కనీస అవగాహన నీకు లేదు.ప్రజలు ఒక్కసారి నిన్ను నమ్మి మోసపోయారు..నీవు చేసే నాటకాలు గమనిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -