పాకిస్తాన్‌ కెప్టెన్‌ సరికొత్త రికార్డు..

62
Pakistan skipper Babar Azam

పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. నిన్న‌ సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డేలో అత‌ను 103 ర‌న్స్ చేశాడు. ఈ సెంచరీ సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్‌ నిలిచాడు. అంతకముందు కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. హషీమ్‌ ఆమ్లాకు 83 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

కాగా బాబర్‌ అజమ్‌ మాత్రం 13 వన్డే సెంచరీలు చేయడానికి 76 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకొని కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌న్డేల్లో కోహ్లీనే బ్యాటింగ్‌లో డామినేట్ చేస్తున్నాడు. 857 పాయింట్ల‌తో విరాట్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబ‌ర్ 837 పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో ఉన్నారు.