దేశంలో ఉద్యానపంటల సాగు పెరగాలి: నిరంజన్ రెడ్డి

288
niranjan reddy
- Advertisement -

దేశంలో ఉద్యానపంటల సాగు పెరగాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అక్కడి వ్యవసాయ పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్‌ రెడ్డి… మహారాష్ట్రలో వానాకాలం, యాసంగి లో కలిపి 174.06 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు అయిందన్నారు.

ప్రధానంగా 80 – 85 లక్షల హెక్టార్లలో పత్తి, సోయాబీన్ సాగు ,మామిడి, నారింజ, దానిమ్మ, ద్రాక్ష, పూలమొక్కలు ప్రధాన ఉద్యాన పంటలు సాగయ్యాయని చెప్పారు. ఉద్యాన పంటల సాగుతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తులు సాధించడం ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయం పెంపుపై దృష్టి సారించారని… తెలంగాణలో ఉద్యానపంటల సాగు రకాలను విస్తరించి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో తీగజాతుల కూరగాయలు, పందిరి (పెండల్) సాగు పద్దతిని అభినందించిన మహారాష్ట్ర మంత్రులు దేశ రైతాంగం పంటల సాగులో విచ్చలవిడిగా ఎరువులు, పురుగుమందుల వాడకం మాని శాస్త్రీయంగా మాత్రమే వాడాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాలు, నియంత్రిత సాగువిధానంపై ప్రశంసలు కురిపించిన మహరాష్ట్ర మంత్రులు. ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ ప్రణాళిక వివరించిన మంత్రి .. ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని యోచిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం. ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపించారు మహారాష్ట్ర మంత్రులు. త్వరలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఆయిల్ పామ్ క్షేత్రాలను సందర్శించనుంది మహారాష్ట్ర మంత్రుల బృందం.

తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వినూత్న పద్దతులలో సాగుకు పెద్దపీట వేయడం హర్షించదగ్గ విషయమన్న మహారాష్ట్ర మంత్రులు .. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయంపై చూపుతున్న శ్రద్ద అభినందనీయం అన్నారు. – నేటి నుండి నాలుగు రోజులపాటు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలను సందర్శించనుంది తెలంగాణ ఉద్యానశాఖ బృందం. పూర్తి సహాకారం అందిస్తామన్న మహారాష్ట్ర ఉద్యానశాఖ.ఉద్యాన పంటల సాగు విధానంపై మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి దాదాజీ దగదుబూసే, ఉద్యానశాఖ మంత్రి సందీపన్ రావు బుమ్రే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నాథ్ దవాలేతో భేటీ అయ్యారు నిరంజన్ రెడ్డి.

- Advertisement -