వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రస్థానంలో తెలంగాణ..

63
niranjan reddy
- Advertisement -

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తులలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రం లాంటిదన్నారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను తెలంగాణ మించడం అసాధారణ విజయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారన్నారు. కరోనా విపత్తులో ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ సేవలు అనిర్వచనీయం అన్నారు. ఈ 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరుతుందన్నారు.

వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు పథకం ఈ మైలురాయిని అందుకోవడం చారిత్రక సందర్భం అన్నారు. రైతుబంధు వారోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -