బండి సంజయ్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్..

99
minister-niranjan-reddy-
- Advertisement -

హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బండి సంజయ్ దీక్షలపై నిప్పులు చెరిగారు. సాయంత్రం ఐదు గంటలకు వరకు తెలంగాణలో యసంగి లో వేసే వరి పంటను కేంద్రం కొనుంటుంది అనే విషయంలో చెప్పించాలని సవాల్ విసిరారు. లేదంటే కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు రాజీనామా చేయాలి… మీరు కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు నిరంజన్ రెడ్డి.

కేంద్రం ధాన్యం కొంటామనేదాకా బీజేపీ దీక్షలు చేయాలని ఎద్దేవా చేశారు. ఎవరిని మభ్య పెట్టడానికి బండి సంజయ్ దీక్ష .. బీజేపీ థర్డ్ క్లాస్ రాజకీయాలు మానుకోవాలన్నారు. మీకు దమ్ముంటే సాయంత్రం 5 గంటల లోపు తెలంగాణలో వేసే ప్రతి పంటా, మొత్తం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం నుండి ఉత్తర్వులు తీసుకురావాలన్నారు. చేతకాకపోతే మీ ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు వెంటనే రాజీనామా చేయండి .. నా వాదనలో తప్పుంటే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.

రైతుల విషయంలో కేంద్రానిది రెండు నాల్కల ధోరణి .. వారి జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. వానాకాలం మొదలవడానికి ముందు నుండి నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కోరినా కేంద్రంలో చలనం లేదన్నారు.

బీజేపీ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా హుజూరాబాద్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అన్నారు. దేశంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణలో 63 లక్షల ఎకరాలలో వరి సాగయింది .. వంద శాతం పంటల నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.ఈ విషయం కేంద్రానికి చెబితే అంత వేశారా ? మాకు శాటిలైట్ లో కనిపించడం లేదు .. మేము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం అని ఇంతవరకు పరిశీలన లేదు .. 3 నెలలుగా సాగదీస్తున్నారు .. ఈ రోజు కూడా మన అధికారులు ఢిల్లీలో ఉన్నారని తెలిపారు.

- Advertisement -