Niranjan Reddy:ముమ్మరంగా వరి సాగు

65
- Advertisement -

రైతుభీమాకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే నూతనంగా వచ్చిన ధరఖాస్తులను అప్ లోడ్ చేయాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి…సేంద్రీయ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను మరింత ప్రోత్సహించాలన్నారు.

నేల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా రైతాంగాన్ని మరింత చైతన్యం చేయాలన్నారు. పంటల సాగు వివరాలు వెంటనే తెలియజేయాలని…వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెప్టెంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ సీజన్ కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.

Also Read:బీజేపీ సైన్యం రెడీ..అయిన డౌటే?

ఇప్పటి వరకు 83 లక్షల ఎకరాలలో వ్యవసాయ పంటలు, 7.50 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు సాగయ్యాయని చెప్పారు. వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని…ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. ఇచ్చిన లక్ష్యం మేరకు వెంటనే మొక్కలు నాటించాలన్నారు.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 72 కోట్లు

- Advertisement -