రైతుబంధు నిధులు విడుదల

206
niranjan reddy
- Advertisement -

రైతు బంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.తక్షణమే రైతులందరికీ రైతుబంధు వారి అకౌంట్‌లలో జమ అవుతుందని రైతులే ఈ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అన్నారు.

సీఎం కేసీఆర్ దృడ సంకల్పానికి ఇది నిదర్శనం అని ఈ వానాకాలం సీజన్ కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. తక్షణమే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని విడుదలకు సిద్దంగా మరో రూ.1500 కోట్లు ఉన్నాయని చెప్పారు.

రైతును రాజును చేయాలన్న కేసీఆర్ మొక్కవోని సంకల్పానికి ఇది తార్కాణంఅని తెలిపిన నిరంజన్ రెడ్డి కరోనా విపత్తుతో దేశమంతా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది .అయినా వ్యవసాయరంగానికి రూ.7 వేల కోట్లు కేటాయించడం విశేషం అన్నారు.

దేశంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రైతు బతికితే రాష్ట్రం బతుకుతుంది .. ఇది రైతు రాష్ట్రం .. రైతులదే ఈ రాష్ట్రం అన్నారు. సాగునీటికి, వ్యవసాయ రంగానికి, సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న నిరంజన్ రెడ్డి కేసీఆర్ ఆలోచనల మూలంగా ఆరేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం ఉజ్వలంగా మారిపోయిందన్నారు. నియంత్రిత వ్యవసాయంతో అది మరింత మారనుందని తెలిపారు.

- Advertisement -