ఇలాంటి వరి ప్రయోగం తెలంగాణలో చేయాలి..

655
Minister Niranjan Reddy
- Advertisement -

కేరళ లోని త్రిసూరులో vaiga (value addition for income generation in agriculture) 2020 (వ్యవసాయంలో రైతుల పంటలను లాభదాయకం చేయడం ఎలా) అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరైయ్యారు. అయితే ఇందులో భాగంగా ఆయన త్రిసూరు సమీపంలోని పుల్లయి వరి సాగు క్షేత్రం పరిశీలించారు. అక్కడ సాగు తీరు, వ్యవసాయ యాంత్రీకరణ, దిగుబడి, నీటి తీరువా, కూలీల పరిస్థితిపై రైతులతో మంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ 900 ఎకరాలలో సంఘటితంగా సహకార సంఘం ఏర్పాటు చేసుకుని సాగుచేస్తున్న దాదాపు 800 మంది రైతులు ఉన్నారు. వీరు అవలంభించే వ్యవసాయ పద్దతులు బాగున్నాయి. వారు ధాన్యం ఒకరోజు నీటిలో తడిపి చిన్న మొలకలు రాగానే మడిలో చల్లుతున్నారు. కలుపు రాకుండా 20 రోజుల పాటు పొలం ఆరబెట్టి మందు పిచికారి చేసి మడికి నీళ్లు ఇచ్చి కలుపు నివారిస్తున్నారు రైతులు. ఈ విధానంతో ఎకరానికి 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మంత్రి తెలిపారు.

Niranjan Reddy

అంతేకాదు కూలీల కొరతను ఎదుర్కొనేందుకు సహకారసంఘంగా ఏర్పడ్డారు ఇక్కడి రైతులు. స్పామ్ పథకం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు సమకుర్చుకున్నారు. ఈ సబ్సిడీ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో పడుతాయి.ఈ సహకార వ్యవసాయం బాగుంది. ఈ విధంగానే తెలంగాణలో కరీంనగర్ జిల్లా తిరుపతిరెడ్డి, లక్ష్మి రైతు దంపతులు ఆరుతడి వరి పండిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించే ఫలితాలు సాధించారు. వారు చేసిన డ్రిప్ వరి కూడా విజయవంతం అయింది అని మంత్రి అన్నారు.

కాగా కేరళ తరహా వరి ప్రయోగం తెలంగాణలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. కూలీల కొరత కేరళలో తీవ్రంగా ఉంది.. మగ కూలీ వెయ్యిపెట్టినా దొరకడం లేదు. కూలీల కొరత అధిగమించేందుకే నారు మడి, నాట్లు లేకుండా రైతులు నేరుగా ధాన్యం మడిలో చల్లుతున్నారు. రైతులతో తెలంగాణ వ్యవసాయ పరిస్థితులను, పథకాలను ఈ సదస్సులో వివరించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -