తెలంగాణ దేశానికి దిశ చూపుతుంది..

304
Minister Niranjan Reddy Review on New Agriculture System
- Advertisement -

హైదరాబాద్‌లో నూతన వ్యవసాయ విధానంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలో పరిస్థితి మారింది. 24 గంటలు నాణ్యమైన కరంటు ఇస్తున్నాం. రైతులు విత్తనాల కోసం తండ్లాడే పరిస్థితి మారింది. ఎరువుల కోసం ఎదురుచూసే దుస్థితి తప్పింది. గత సర్కారులో గోదాములలో దాచుకునే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ సర్కార్ 4 లక్షల కెపాసిటీ నుండి 24 లక్షలకు గోదాములను పెంచింది. ఇప్పుడు దాన్ని అదనంగ మరో 40 లక్షల కెపాసిటీకి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాక ముందు వరి మాత్రమే కొనుగోలు.. అన్ని పంటలకు అవకాశం లేదు.. తెలంగాణ ప్రభుత్వంలో వంద శాతం కొనుగోళ్లు చేపడుతోంది. దళారులు, వ్యాపారుల మీద ఆధారపడకుండా తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడింది. ఒకప్పుడు రైతు మరణిస్తే ఆ కుటుంబం అధోగతి పాలయ్యేది. ఇప్పుడు ఆ కుటుంబం సొంతకాళ్లపై, ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మహత్య చేసుకునే స్థితి నుండి.. ధైర్యంగా ముందుకుసాగే భరోస టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్పించిందని మంత్రి అన్నారు.

అదేవిధంగా వ్యవసాయ శాఖలో 5000 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వమే.పట్టణాల నుండి ప్రజలను వ్యవసాయం వైపు, వలసలను గ్రామాల వైపు మళ్లిండం తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమయింది. రైతుకు పిల్లనియ్యనన్న పరిస్థితి నుండి.. రైతుకే పిల్లనిస్తమన్న అలోచనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆరేళ్లలో వ్యవసాయం దండగ అనే మాట నుంచి పండగ అనే స్తితికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది.

సాంప్రదాయ పంటలొద్దు.. రైతుల అలోచనలు మార్చండి.వారికి లాభమయ్యే పంటలే సాగు చెయ్యాలి. మార్కెట్ల పరిస్థితి, దేశంలోని వివిధ రాష్ట్రాలలో అవసరాలు అధికారులు ఆధ్యయనం చేయాలి. తెలంగాణ దేశానికి దిశ చూపుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -