వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి హాజరై గ్రామంలో పర్యటించి గ్రామానికి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కింద మంజూరైన పథకాలు, పనులు, లబ్దిదారుల వివరాలు ప్రజలకు తెలియజేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…సాగునీళ్లు, తాగునీళ్ల కోసం హామీఇచ్చాను….ముఖ్యమంత్రిని ఒప్పించి అభివృద్ధి చేస్తానని చెప్పారు.
తాగునీళ్లు అందించడం జరిగింది.. సాగునీళ్లు అందించడానికి ప్రతిపాదనలు సిద్దమయ్యాయని వెల్లడించారు. సవాయిగూడెం వరకు కాలువ వచ్చింది .. అక్కడి నుండి రూ.18 కోట్లతో సాగునీళ్లు అందించడానికి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి .. కేసీఆర్ ని ఒప్పించి సంతకం చేయించి పనులు ప్రారంభిస్తాం అన్నారు. కిష్టగిరి ఒక్క గ్రామానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితులకు రూ.8.51,500 అందజేయడం జరిగిందన్నారు. రైతుబంధు కింద ఒక కోటి 89 లక్షల 36 వేల 315 రూపాయలు అందించాం అన్నారు.
రైతుభీమా కింద కిష్టగిరి గ్రామంలో నాలుగు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. కేసీఆర్ కిట్ అమ్మవడి పథకం కింద ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేల చొప్పున గ్రామంలో 65 మంది లబ్దిచెందారన్నారు. రూ.29 లక్షలతో మిషన్ కాకతీయ కింద చెరువులు కుంటలు బాగుచేయడం జరిగిందని….మిషన్ భగీరధ పథకం కింద గ్రామంలో 25 లక్షల 77 వేల 700 రూపాయల ఖర్చుతో 238 ఇండ్లకు నల్లానీళ్లు ఇవ్వడం జరిగిందన్నారు.