ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు..

40
- Advertisement -

ఆశాజనకంగా వ్యవసాయం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయంలోని వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, అగ్రోస్ ఎండీ రాములు, ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి..వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి .. వరి నాట్లు జోరందుకున్నాయన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంత సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం గారు ఉన్నతస్థాయిలో, రెండు సార్లు శాఖ తరపున సమీక్ష చేశాం అన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా స్వల్పకాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలన్నారు.శాస్త్రవేత్తల సూచన ప్రకారం కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవచ్చని…మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈ నెలాఖరు వరకు అనుకూలం అన్నారు. ఇదివరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదును నేపథ్యంలో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.

నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలన్నారు.దీనిమూలంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసి వస్తుందని…రైతులకు అవసరం అయిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుందని..వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read:పి‌ఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ కష్టమే?

తెలంగాణ 32 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు.ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం అన్నారు.గత ఏడాది అధిక వర్షాల మూలంగా ఆయిల్ పామ్ సాగుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని…ఈ ఏడాది అన్నీ సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.ఇప్పటికే 11 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తి అయిందని…75 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటు కోవడానికి ఆన్ లైన్ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.

దీనికి సంబంధించి రైతులకు అందాల్సిన రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.అధికారులు ఆయిల్ పామ్ సాగుకు రైతులను మరింత ప్రోత్సహించాలని…నూతనంగా ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసిన జిల్లాలలో వెంటనే ఇతర జిల్లాల నర్సరీల నుండి మొక్కలు ఇచ్చి వెంటనే నాట్లు వేయించాలన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 65 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు జరిగిందన్నారు.

Also Read:జీవితా రాజశేఖర్ దంపతులకు బెయిల్..

- Advertisement -