వ్యవసాయంలో తెలంగాణ మొదటి స్ధానం

466
niranjanreddy
- Advertisement -

వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో ఉందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నగరంలోని హాకా భవనంలో మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్ధానంలో నిలిచిందన్నారు. 2020 సంవత్సరంలో అయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం తరపున ప్రొత్సాహం అందించనున్నట్లు తెలిపారు.

240 మండలాల్లో అయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమైనవని కేంద్రం తేల్చింది. 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అయిల్‌పామ్‌ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీకి అనుబంధంగా రెండు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సెస్‌ ఉన్నాయి. ఇంట్లో కుండీల్లోనే కూరగాయలు పండించే పరిజ్ఞానాన్ని ములుగు, జీడిమెట్లలో అభివృద్ధి చేశారు. అధిక రసాయనాల వాడటం వల్ల పంట దిగుబడి తగ్గడంతో పాటు నేల నిస్సారం అవుతుంది. భూసార పరీక్షలపై అధికారులు రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -