- Advertisement -
వరంగల్ జిల్లాలో పర్యటించారు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు. పరకాల – నర్సంపేట సబ్ డివిజన్లలో వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. మంత్రులను చూడగానే బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రులతో పాటు రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి పంటలను పరిశీలించారు.
- Advertisement -