Niranjan ReddY:అభివృద్ధిలో రాజకీయాలు లేవు

20
- Advertisement -

పేదరికం,సంక్షేమం, అభివృద్ధిలో రాజకీయాలు లేవన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన ఫించన్ రూ.3016 నుండి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ ల మాదిరిగా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల వర్తింపు చేస్తున్నామన్నారు. అందరూ బాగుండాలి…అందులో మనం ఉండాలన్నారు. కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని…సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. దశలవారీగా అందరికీ రూ.లక్ష సాయం అందజేస్తామని …ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకుంటే విడతలవారీగా ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామన్నారు.

Also Read;కాంగ్రెస్ టికెట్ల అమ్మకం.. నేడే లాస్ట్!

395 మందికి బీసీ బంధు కింద రూ.లక్ష చొప్పున తొలివిడత చెక్కులు అందించామని…పనిచేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నేడు తెలంగాణ నుండి వలసలు ఆగిపోయాయి .. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు. అన్నార్తులకు అండగా నిలవాలని ఆసరా ఫించన్లు ఇస్తున్నారన్నారు. దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచడం మూలంగా వనపర్తి నియోజకవర్గంలో 6551 మందికి లబ్ది చేకూరిందన్నారు. రైతును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఉచిత కరంటు, రైతుభీమా, రైతుబంధు, సాగునీళ్లు ఇస్తూ పండించిన పంటలు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. వ్యవసాయం బాగుపడడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు నిలదొక్కుకుంటున్నాయని…వ్యవసాయ రంగం బలపడడంతో అనేక వ్యాపార రంగాలు నూతనంగా ఏర్పాటు అవుతున్నాయన్నారు.

Also Read:ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -