కాంగ్రెస్ టికెట్ల అమ్మకం.. నేడే లాస్ట్!

24
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో టి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై గట్టిగా దృష్టి సారించింది. మరోవైపు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో హస్తంలో ఒత్తిడి పెరిగింది. కాగా టికెట్ల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన హస్తం పార్టీ.. నేటితో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 700 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరినుంచి చివరగా బరిలో నిలిచే అభ్యర్థులను ఎన్నుకోవడం హస్తం అధిష్టానానికి అంతా తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీలో మొదటి నుంచి కూడా వర్గవిభేదాలు చాలా ఎక్కువ. అందువల్ల టికెట్ లభించని వారిలో తీవ్ర అసంతృప్త జ్వాలలు రేగే అవకాశం ఉంది.

పైగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ చేరికలను గట్టిగా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దాంతో టికెట్ ఆశించి పార్టీలో చేరే వారికి కోరిన టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి మరి ఈ సమస్యలన్నిటిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా అధిగమిస్తారనేది చూడాలి. ఇకపోతే కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. జనగామ నుంచి పొన్నాల, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, నాగార్జున సాగర్ కు జానారెడ్డి కుమారుడు రఘువీరా రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు ఇక వచ్చే నెల మొదటి వారంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో 70-80 సీట్లకు అభ్యర్థులను కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గట్టగా సత్తా చాటలని చూస్తున్న కాంగ్రెస్ కు అభ్యర్థులను ఎంపిక చేయడమే సవాల్ గా మారింది. మరి హస్తం పార్టీ బైలో నిలిచే ఆ నేతలెవరో చూడాలి. ఇదిలా ఉంచితే రేపు చేవెళ్ళలో జనగర్జన సభకు హాజరయ్యేందుకు ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే రేపు తెలంగాణకు రానున్నారు. ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది.

Also Read:టీడీపీకి ఆ ఛాన్స్ ఉందా?

- Advertisement -