తెలంగాణలో నీలి విప్లవం నడుస్తోందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీ చేయనున్నామని తెలిపిన ఆయన – ఉచిత చేపపిల్లలతో మత్స్యకారులకు ఉపాధితో పాటు తెలంగాణకు ఆదాయం పెరిగిందన్నారు.
ప్రస్తుతం కోటి 10 లక్షల చేప పిల్లలు వివిధ చెరువులు రిజర్వాయర్లలో విడుదల చేశామని…. మత్య్సకారులకు ఆర్థిక సంపదతో పాటు, వృత్తి సంపద నిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు ఆరోగ్య సంపదనిస్తుందని… ఉచిత చేప పిల్లల పథకం మత్స్యకారులతో పాటు తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని…. సమైక్య పాలనలో కూలిన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఊపిరి నిచ్చామని తెలిపారు. రైతులు, వృత్తిదారులు ఉండే పల్లెలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుంది
ని దానిని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని తాళ్లచెరువు, నల్లచెరువులలో 2.10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు నిరంజన్ రెడ్డి.