ఎమ్మెల్సీ కవితకు విషెస్ తెలిపిన కోలేటి దామోదర్‌..

141
koleti damodhar

ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కల్వకుంట్ల కవితకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌.

నిత్యచైతన్యశీలి అయిన కవిత గారు తెలంగాణ మహిళా లోకానికే తలమానికం. “తెలంగాణ జాగృతి” సంస్థను నెలకొల్పి, తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ మహిళలలోనూ, ప్రజలలోనూ ఆమె తెచ్చిన స్ఫూర్తి అపూర్వం, అనితర సాధ్యం అన్నారు.

ఆమె రాకతో తెలంగాణ ఉద్యమ స్వరూపమే మారిపోయి, అదొక తెలంగాణ పండుగగానూ, బతుకమ్మ ఉత్సవంగానూ ప్రజలలో ఆనందోత్సాహాలు తెచ్చిందని…ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కవిత గారు తెలంగాణ అభివృద్ధికి అనితర సాధ్యమైన కృషి చేస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని వెల్లడించారు దామోదర్.