పత్తి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌: నిరంజన్ రెడ్డి

83
niranjan
- Advertisement -

పత్తిసాగు విస్తీర్ణంలో తెలంగాణ దేశంలో రెండో స్ధానంలో ఉందని వెల్లడించారు మంత్రి నిరంజన్ రెడ్డి. నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. అసెంబ్లీలో పత్తిలో తేమ శాతం, వర్షాలతో పంటనష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నిరంజన్ రెడ్డి…ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు ఉత్పత్తి అవుతుందన్నారు.

రాష్ట్రంలో ఈసారి పత్తి సేకరణ లక్ష్యం 33.20 లక్షల మెట్రిక్‌ టన్నులని చెప్పారు. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు. పత్తి కొనుగోలుకు జిన్నింగ్‌ విల్లులనే నోటిఫైడ్‌ ఏజెన్సీలుగా గుర్తింపునిచ్చామన్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉంటేనే సీసీఐ కొంటుందన్నారు. జిన్నింగ్‌ మిల్లులో జరిగే ప్రమాదాలతో రైతుకు సంబంధం ఉండదని చెప్పారు.

- Advertisement -