- Advertisement -
మంత్రి మల్లారెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మేడ్చల్ జిల్లా బహుదూర్ పల్లి గౌరీ అనాధ ఆశ్రమంలో యువతి పెళ్లికి తండ్రిగా మారడమే కాకుండా దగ్గరుండి మరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
విజయవాడకు చెందిన యువకుడితో పుష్పకు పెళ్లి నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకకు మంత్రి చామకూర మల్లారెడ్డి, తన భార్యతో కలిసి హాజరై.. పెళ్లి పెద్దగా, ముఖ్య అతిథిగా మారారు. అనాధ యువతిని సొంత బిడ్డలా భావించి.. దంపతులిద్దరూ కన్యాదానం చేశారు.
అమ్మాయి పేరున రూ.235000 ఫిక్స్‌డిపాజిట్ చేయడమే కాదు రూ. 25వేల నగదును నూతన దంపతులకు అందజేశారు. కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులకు ఆశ్రమ నిర్వహకులు, పెండ్లి కూతురు పుష్ప, పెండ్లి కుమారుడు కిశోర్ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -