మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై మాట్లాడారు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. నాగరాం మునిసిపల్ పరిధి లోని ప్రజా సమస్యల పై మంత్రి మాట్లాడారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.నాగారం మున్సిపాలిటిలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
జలమండలి ద్వారా త్రాగు నీటి పైప్ లైన్ కోసం త్రవ్విన రోడ్ల ను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా రోడ్ల సమస్య డ్రైనేజీ శానిటేషన్ వంటి సమస్యలను వీలైనంత త్వరగా ఐదు పది రోజుల్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందుల నుంచి తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు,వైస్ చైర్మన్ వెంకటేష్ , రాజశేఖర్ రెడ్డి కమిషనర్ వాని గారు,అధికారులు,నాయకులు,ప్రజాప్రతినిధులు ,వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.