ఉత్తమ్ పద్మావతి కి ఓటమి తప్పదుః మంత్రి సత్యవతి

350
Satyavathi Rathod

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతికి ఓటమి తప్పదన్నారు మంత్రి సత్యవతి రాధోడ్. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మట్టంపల్లి మండలం పెడవిడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్,, mla చిరుమర్ధి లింగయ్య.. mla అభ్యర్థి సైదిరెడ్డి పాల్గోన్నారు. ఈసందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి కాంక్షతో హుజుర్నగర్ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు.

హుజుర్ నగర్ లో అభివృద్ది కోసం ప్రజలంతా టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వార్ధ పరుడు , అహంభావి ప్రజాసమస్యలపై ఉత్తమ్ కి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. తండాలు అన్నీ ఏకపక్షంగా టీఆర్ఎస్ ఓటు వేస్తామని చెబుతున్నారు. తాండలను గ్రామ పంచాయతీ లుగా మార్చిన సీఎం కేసీఆర్ వెంటే గిరిజన బిడ్డలు వున్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ఓటు మురిగిపోతుంది అదే TRS కు ఓటేస్తే అభివృద్ధి ముందుకు పోతుందని తెలిపారు.