పతంగ్ ఎగురవేసి మంత్రి మల్లారెడ్డి..

130
- Advertisement -

గతంలో సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రా తోపాటు ఇంకా ఎక్కడో చూస్తుంటిమి, కానీ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతులను అన్నిరకాలా ఆదుకుంటూ పంటలు బాగా పండించిన ఘనత మన రైతులది,సీఎం కేసీఆర్ దని,అందుకే ఇక్కడే సంక్రాంతి ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయిన్ పల్లిలో టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగులను మంత్రి మల్లారెడ్డి పిల్లలకు పంపిణీ చేశారు.

అనంతరం అయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరంటు,సాగుగు నీళ్లు,విత్తనాలు,ఎరువులు ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటూ మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించె విధంగా కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం ఎరువుల ధరలు పెంచిందని ఆరోపించారు. ఇలానే కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తే సంక్రాంతి పండుగకు పతంగ్ ఎలా కటింగ్ అవుతుందో రానున్న ఎన్నికల్లో వారి పరిస్థితి కూడా కటీఫ్ పతంగ్ మాదిరి అవుతుందని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు..అలాగే తనదైన శైలిలో మంత్రి కొద్దిసేపు పతంగ్ ఎగురవేసి సందడిచేశారు.

- Advertisement -