జై బాబు జై జై బాబు.. నల్లగొండలో చంద్రబాబుకు ఘన స్వాగతం..

19

నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. గురువారం రాత్రి ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో తన పర్యటన ముగించుకుని రోడ్డు మార్గాన నల్లగొండ జిల్లా మీదగా హైదరాబాద్ వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జై బాబు జై జై బాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ నుండి దిగి కొద్దిసేపు వారితో ముచ్చటించి హైదరాబాద్ వెళ్లిపోయారు.