- Advertisement -
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు పర్యటించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి గగన్ పహాడ్‌లో పర్యటించారు. వరద బాధితులతో పాటు పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు.అలాగే అలీనగర్‌లో గల్లంతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు కేటీఆర్.
గగన్‌పహాడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు కాగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా అలీనగర్‌లో గల్లంతైన 8 మందిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పిస్తుందని..ఎలాంటి అంటురోగాలు ప్రభలకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేటీఆర్.
- Advertisement -