పేదవారు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే..సీఎం కేసీఆర్ ఆకాంక్ష

153
ktr
- Advertisement -

పేదోడు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ఉద్దేశమ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్. వనస్థలిపురంలో జైభవాని నగర్‌ రైతు బజార్ వద్ద నిర్మించిన 324 డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్…తెలంగాణ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…. పేదోడి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్ష‌ల ఖ‌ర్చు పెట్టి నిర్మించామ‌ని తెలిపారు.

ఇల్లు బాగుంటే స‌రిపోదు.. ప‌రిస‌రాల‌ను కూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. చెత్త‌ను తీసుకువ‌చ్చి ఇండ్ల మ‌ధ్య‌లో పారేయొద్దు. కొత్త రోగాలు, జ‌బ్బులు రాకుండా ఉండాల‌న్న‌, పిల్ల‌ల ఆరోగ్యం మంచిగా ఉండాల‌న్న పరిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

రెండు ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించారు. ఈ ఇండ్లను రూ.28కోట్ల వ్యయంతో నిర్మించారు.

- Advertisement -