రైతు బంధుతో ఆత్మహత్యలు తగ్గుముఖం: మంత్రి కేటీఆర్

134
ktr
- Advertisement -

రైతు బంధుతో రాష్ట్రంలో ఆత్మహత్యులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… టీఆర్‌ఎస్‌ పార్టీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. ప్రస్తుతం మంత్రి స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. కేసీఆర్ తనను ఐఏఎస్ చేయాలనుకున్నారని తెలిపారు.

రైతుబంధు కోసం రెండు సీజన్లలో కలిపి 62లక్షల మంది రైతులకు రూ.15వేల కోట్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకం అమలు చేసిన సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు 11 రాష్ట్రాలు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని… రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 24 గంటల నాణ్యమైన, అంతరాయం లేని కరెంటు అన్ని రంగాలకు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టంచేశారు.

తెలంగాణలో 17శాతం దళితులు ఉన్నారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో దళితులు వివక్షకు గురవుతున్నారని, వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దళితబంధుతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

- Advertisement -