తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై ఇటీవల పార్లమెంట్ లో జరిగిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రానికి పార్లమెంట్ సమావేశాలలో విజ్ఞప్తి చేశారు. అయితే నామ నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర వైద్య శాఖమంత్రి మన్సుక్ మాండవియా పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గతంలోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో 13 రాష్ట్రాలనుంచి ఈ అంశంపై కేంద్రానికి వినతులు వచ్చాయని తెలంగాణలో కూడా బల్క్ డ్రగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. .
అయితే 2022 సెప్టెంబర్ 1న బల్క్ డ్రగ్ ఏర్పాటుకు తెలంగాణ చేసిన వినతిని కేంద్రం పట్టించుకోలేదు. వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉన్న హైదరబాద్ ను కాదని మరోసారి గుజరాత్,పైనే వారాలు కురిపించింది. గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ కేటాయించిన కేంద్రం తెలంగాణను మాత్రం పక్కనపెట్టేసింది. అయితే తాజాగా ఇదే అంశం పార్లమెంట్ లో చర్చకు రాగా అల్రడీ తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించినట్లు కేంద్ర మంత్రి మాండవియా చెప్పుకొచ్చారు. దీంతో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
తెలంగాణకు బల్క్ డ్రగ్ ఇచ్చామంటూ పార్లమెంట్ సాక్షిగా మాండవియా పచ్చి అబద్దం ఆడుతున్నారని ట్విట్టర్ లో ద్వజమెత్తారు. భారతదేశ లైఫ్ సైన్సెస్ హబ్ బల్క్ డ్రగ్ ఇవ్వకుండా తీరని అన్యాయం చేసి, ఇచ్చినట్లు పచ్చి అబద్దలు ఆడుతున్నారని కేటిఆర్ మండి పడ్డారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పెట్టించే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై లోక్ సభలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని ఎంపీ నామ నాగేశ్వరరావు ను కోరారు. కాగా లిఖితపూర్వక సమాధానంలో మాత్రం హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించినట్లు పేర్కొన్న కేంద్రం.. నోటి మాటతో తెలంగాణకు కూడా కేటాయించినట్లు చెప్పడం నిజంగా కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి ఇదే నిదర్శనం అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
The Minister had not only misled the people of Telangana with his white lies but also the August house; Indian parliament
Request @BRSparty Floor leader in Loksabha Sri @MPnama Garu to move a privilege motion and make sure he apologises to people of Telangana for misleading
— KTR (@KTRTRS) December 17, 2022
ఇవి కూడా చదవండి..