బాలయ్యతో వై.ఎస్ షర్మిల ముచ్చట్లు

66
- Advertisement -

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ రావడం.. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుండటంతో.. బాలయ్య షో మళ్లీ హాట్ టాపిక్ అయింది. అయితే, సీజ‌న్ 2 కు గెస్ట్ ల కొరత పీడిస్తోందనేది నిజం. ముఖ్యంగా స్టార్ హీరోల డేట్లు మ్యాచ్ కావడం లేదు. అందుకే, మొదటి ఎపిసోడ్ నుంచి ఈ సీజన్ 2కి పొలిటికల్ టచ్ కూడా ఇస్తూ వచ్చారు. ఇప్పటికే మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లు గెస్టులుగా వచ్చి అలరించారు. ఇప్పుడు మరో రాజకీయ నేత గెస్ట్ గా రాబోతున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సీఎం ను అవుతా అంటూ పార్టీని స్టార్ట్ చేసిన షర్మిల గెస్ట్ గా రాబోతున్నారు. గమ్మత్తేమిటంటే షర్మిలకి బాలయ్య కి మధ్య పెద్దగా పరిచయం కూడా లేదు. పైగా తెలుగుదేశం పార్టీతో ఆమెకు శతృత్వం కూడా ఉంది. అయితే, షర్మిల కి జగన్ కీ మధ్య ప్రస్తుతం అనుబంధం ఏమీ బాగాలేదు. అందువల్ల వెల్ ప్లాన్డ్ గా టీడిపి పార్టీకి అనుకూలంగా పొలిటికల్ టచ్ ఇస్తున్నారా? లేక రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉపయోగపడేలా ఈ ఎపిసోడ్ లను ప్లాన్ చేస్తున్నారా? అన్నది అనుమానమే.

షర్మిల- బాలయ్య మధ్య ముచ్చట్లు ఎక్కువగా రాజకీయాల మీదే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. షర్మిలకు సినిమాలకు సంబంధం లేదు. మొత్తానికి బాలయ్య షో నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ రానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -