భోజనం చేస్తూ నీళ్ళు తాగితే.. ఇంత ప్రమాదమా ?

101
- Advertisement -

చాలా మందికి బోజనం చేస్తూ నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. కొందరికి నీళ్ళు పక్కన లేనిదే బోజనం కూడా చేయలేరు. ఒక్క బోజనం విషయంలోనే కాకుండా ఏదైనా తింటూ నీళ్ళు తాగడం తాగడం.. తన్న తరువాత నీళ్ళు తాగకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే తింటూ నీళ్ళు మంచిదేనా లేదా ఏమైనా అనార్థాలు జరిగే అవకాశం ఉందా అనే దానిపై మాత్రం ఎవరికి ఎలాంటి అవగాహన ఉండదు. మరి తింటూ నీళ్ళు తాగడం వల్ల మన శరీరంలో చోటు చేసుకునే మార్పుల గురించు తెలుసుకుందాం.

సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి జీర్ణాశయంలో హైడ్రో క్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. దీని గాఢత 0.8-1.2 వరకు ఉంటుంది. ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన క్రిములను నశింపజేసి ఆహారం త్వరగా జీర్ణం అవడానికి సహాయ పడుతుంది. సాధారణంగా దీని పిహెచ్ విలువ 1.2- నుంచి 1.5 వరకు ఉంటే ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది. కానీ మనం బోజనం చేస్తూ నీళ్ళు తాగడం వల్ల దీని గాఢత తగ్గుతుంది. ఎందుకంటే ఆహారంతో పాటు నీరు కూడా కలవడంతో ఈ యొక్క యాసిడ్ గాఢత 0.5 కంటే తగ్గుతుంది.

దాంతో యాసిడ్ గాఢత తగ్గే కొద్ది జీవక్రియ నెమ్మదిగా సాగుతుంది. పలుచబడ్డ యాసిడ్ ను బ్యాలెన్స్ చేయడానికి 20 నిముషాల నుంచి 30 నిముషాల టైమ్ పడుతుంది. ఇలా యాసిడ్ గాఢత తగ్గే పలచబడే కొద్ది.. పొట్టలో అల్సర్లు, యాసిడ్ రిప్లిక్స్ వచ్చి తిన్న తరువాత అసౌకర్యానికి గురౌతారు. అంతే కాకుండా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే గ్యాస్, తెంపులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల తింటూ నీళ్ళు తగరాదని నిపుణులు చెబుతున్నారు. నీళ్ళు తాగే అవసరం లేకుండా ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలని సూచిస్తున్నారు. ఇక తిన్న తరువాత కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి ఆ తరువాత నీళ్ళు తాడడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -