తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ర్టిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని విడుదల చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌లో పాలసీ విధానాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్‌కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎస్ బ్యాంకు చైర్మన్ సునీల్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి,రిజిస్ర్టేషన్ చేయించుకుంటే పలు రాయితీలకు అవకాశం కల్పించింది. పెట్టుబడి మొత్తంలో మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ కల్పించనున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజిస్ర్టేషన్ ఫీజులపై రాయితీలు ఇవ్వనున్నారు.
మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 5 వేల ఫోర్ వీలర్లు, 10 వేల లైట్ గూడ్స్, క్యారియర్‌లకు పూర్తిగా పన్ను రద్దు చేయనున్నారు.