పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

188
ktr
- Advertisement -

రాష్ట్రం నుండి పద్మ శ్రీ అవార్డు అందుకున్న కనకరాజుకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..ఆదివాసీల సంప్రదాయ నృత్యం గుస్సాడీకి ఎనలేని గుర్తింపు తెచ్చారని తెలిపారు. గుస్సాడీ గజ్జెల సవ్వడిని ఢిల్లీకి విని‌పించిన కన‌క‌రాజు కుమ్రంభీం జిల్లా జైనూరు మండలం మర్లవా‌యి వాసి. ఇంది‌రా‌గాంధీ, అబ్దుల్‌ కలాం తదితర దేశ ప్రము‌ఖుల సమ‌క్షంలో గజ్జె‌కట్టి గుస్సాడీ ఆడిన ఘనుడు ఆయన… 43 ఏండ్లుగా వంద‌ల‌మంది యువ‌కు‌లకు గుస్సాడీ, ధింసా నృత్యా‌ల్లో కనకరాజు శిక్షణనిచ్చారని తెలిపారు.

- Advertisement -