కిదాంబి శ్రీకాంత్‌ని అభినందించిన కేటీఆర్..

110
ktr
- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన యువ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ను అభినందించారు మంత్రి కేటీఆర్‌. అద్భుత ప్రదర్శనతో బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రజతం దక్కించుకున్న శ్రీకాంత్‌కు అభినందనలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలని అభిలషిస్తున్నా అని ట్వీట్‌ చేశారు.

స్పెయిన్‌ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లోహ్‌ కీన్‌ యె (సింగపూర్‌) చేతిలో పోరాడి ఓడిన శ్రీకాంత్‌ రజతం గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలిచాడు. మరోవైపు శ్రీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ సైతం అభినందనలు తెలిపారు.

- Advertisement -